అమ్మని నాన్నే చంపేశాడు.. డ్రాయింగ్ వేసి చూపించిన నాలుగేళ్ల చిన్నారి

అమ్మని నాన్నే చంపేశాడు.. డ్రాయింగ్ వేసి చూపించిన నాలుగేళ్ల చిన్నారి
  • ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో ఘటన
  • అదనపు కట్నం కోసం వేధింపులు
  • కొట్టి చంపేసి ఉరి వేసిన వైనం
  • అమ్మను తన తండ్రి ఎలా చంపిందీ డ్రాయింగ్ వేసి చూపించిన బాలిక
  • పరారీలో ఉన్న నిందితుడి అరెస్ట్.. మిగతా వారి కోసం గాలింపు

‘పాపా (నాన్న) అమ్మను కొట్టి ఉరివేశాడు. రాయితో తలపై కొట్టాడు. ఆపై గోనె సంచిలో వేసి దూరంగా విసిరేశాడు. ముందు రోజు కూడా అమ్మను భయపెట్టడానికి నాన్న ప్రయత్నించాడు. అప్పుడు నేను ‘‘నువ్వు అమ్మను కొడితే నీ చేతులు విరిచేస్తాను’’ అని చెప్పాను. నాన్న ఎప్పుడూ అమ్మను కొడుతుండేవాడు. అందుకే చచ్చిపోయింది. నన్ను కూడా కొట్టేవాడు’’ అని చిన్నారి వివరించింది. అంతేకాదు, డ్రాయింగ్ వేసి మరీ చూపించింది. చిన్నారి వాంగ్మూలంతో రంగంలోకి దిగిన పోలీసులు పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకుని కటకటాల వెనక్కి పంపారు. మిగతా నిందితుల కోసం గాలిస్తున్నారు.